ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త అందించింది. పంటలు సాగు చేసుకునేందుకు కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని సహకార బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు తక్కువ కాకుండా కౌలు చేసిన వారికే ఈ రుణ సౌకర్యం వర్తిస్తుందని, గరిష్టంగా రూ.లక్ష వరకు రుణాలు ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ రుణాలను వడ్డీతో సహా ఏడాదిలోపు చెల్లించాల్సి ఉంటుంది. డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి ఈ రుణాలు వర్తించవని ప్రభుత్వం స్పష్టం చేసింది.