TG: రైతులు పంట మార్పిడి చేసుకోవడం వల్ల భూమిలో సారం పెరిగి, అధిగ దిగుబడులు వస్తాయని నిపుణులు అన్నారు. ముఖ్యంగా పత్తి పంట తర్వాత యాసంగిలో పెసర, మినుము, వేరుశనగ పంటలను సాగు చేయడం వల్ల భూమిలో పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగుతాయని అన్నారు. వేరుశనగ సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేప నూనె, వేరు శనగ పంటల ఉపయోగాలను రైతులకు వివరించారు.