సలేశ్వర క్షేత్రంలో భక్తుల జనసంద్రం

5575చూసినవారు
నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వర క్షేత్రంలో లింగమయ్య జాతర వైభవంగా ప్రారంభమైంది. చైత్రపౌర్ణమి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దట్టమైన అడవులు, లోయలు, 500 అడుగుల ఎత్తైన జలపాతాల మధ్య సాగే ఈ యాత్ర 'దక్షిణ అమర్‌నాథ్'ను తలపిస్తోంది. ప్రకృతి రమణీయత మధ్య భక్తులు కఠినమైన కొండ మార్గాల్లో నడుస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్