తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 8 నుండి 10 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు ఉన్నారు. నిన్న ఒక్కరోజు 69,254 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 20,954 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.