తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం

3427చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 12 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. ఉచిత దర్శనం కోసం సుమారు 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్రదర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు 3-4 గంటల నిరీక్షణ తప్పడం లేదు. ఏప్రిల్ 26న 79,878 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, 33,037 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్