తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని వారికి 8 గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్నవారికి 3-4 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు అందజేస్తూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న 80,167 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, 28,270 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ. 4.1 కోట్లుగా నమోదైంది.