TG: హనుమకొండలో ఒక హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా 300 ఉచిత బిర్యానీ ప్యాకెట్ల ఆఫర్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆఫర్ కోసం వెయ్యి మందికి పైగా జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తోపులాట జరిగింది. స్థానిక పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.