AP: వేసవి సెలవులు, లాంగ్ వీకెండ్, పదో తరగతి ఫలితాల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. అలిపిరి వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శ్రీవారి దర్శనానికి వైకుంఠం కంపార్ట్మెంట్లు నిండి, బయట బాట గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. ఉచిత సర్వదర్శనానికి సుమారు 30 గంటలు, టైమ్ స్లాట్ దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటలు పడుతోంది.