AP: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం జరిగింది. భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రామారావుకాలనీలో ఉండే రామన్న (40) తాగి గొడవ చేస్తున్నాడని భార్య రవణమ్మ, ఆమె తమ్ముడు ఈశ్వర్ రోకలిబండతో కొట్టి చంపారు. రమణమ్మ, ఈశ్వర్ ఫై అనుమానంతో విచారించగా విషయం బయటపడింది. బి.కొత్తకోట వద్ద హంద్రీనీవా కాలువలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేశారు.