సికింద్రాబాద్‍లోని గుజరాతి సేవ మండల్‍లో దక్షిణ భారతదేశంలోనే తొలి హెల్దీ క్రైయింగ్ క్లబ్ ప్రారంభమైంది. ఈ క్లబ్ లో సభ్యులు ఐదు నిమిషాలు ఏడ్చి తమ భారాన్ని తగ్గించుకున్నారు. న్యూరో నిపుణుల ప్రకారం, ఏడ్చినప్పుడు ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ వంటి హార్మోన్లు విడుదలై ఒత్తిడిని తగ్గిస్తాయి. కన్నీళ్లు కళ్లకు లూబ్రికెంట్ గా పనిచేసి, దుమ్ము, బ్యాక్టీరియాను తొలగించి చూపును కాపాడతాయి. అయితే, డిప్రెషన్, యాంగ్జయిటీతో బాధపడేవారు ఏడ్వడం వల్ల ప్రయోజనం కంటే హాని ఎక్కువ జరిగే అవకాశం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.