పెన్షన్ పంపిణీలో కోత.. ఇంటి పన్ను క‌ట్ చేసుకొని పెన్షన్ల నగదు పంపిణీ

44చూసినవారు
AP: తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో వృద్ధాప్య పెన్షన్ డబ్బుల్లో కోత విధించిన సచివాలయ ఉద్యోగిపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పన్ను కింద డబ్బులు కట్ చేసుకున్నట్లు ఉద్యోగి బుకాయించడంతో, ఇంటి పన్నుకు, పెన్షన్‌కు సంబంధం ఏంటని బాధితులు నిలదీశారు. దీంతో ఉద్యోగి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. పెన్షన్ల సంఖ్యతో పాటు డబ్బుల్లోనూ కోత విధించడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్