LPG బుకింగ్ లో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం

4719చూసినవారు
LPG బుకింగ్ లో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం
LPG సిలిండర్ బుకింగ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేక్ వెబ్‌సైట్లు, వాట్సాప్ లింకులు, నకిలీ కాల్స్ ద్వారా వినియోగదారుల బ్యాంక్ వివరాలు, OTPలు సేకరించి కేటుగాళ్లు సొమ్ము దోచుకుంటున్నారు. అందుకే ఎవరికీ OTPలు చెప్పవద్దని, ఫేక్ APK ఫైల్స్ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. కేవలం అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్