AP: వరల్డ్ బైసైకిల్ డే సందర్భంగా విశాఖ సముద్ర జలాల్లో ఏపీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్‌వాటర్ సైక్లింగ్ ప్రదర్శన నిర్వహించారు. నలుగురు స్కూబా డైవర్లు సముద్ర గర్భంలో సైక్లింగ్ చేస్తూ ఫిట్‌నెస్, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సైక్లింగ్ వల్ల ఇంధన పొదుపు, కాలుష్య నివారణతో పాటు ఆరోగ్యం మెరుగవుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు బలరాం నాయుడు పేర్కొన్నారు.