AP: దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నెల్లూరు నగరంలోని అనేక లోతట్టు ప్రాంతాలు మరియు ప్రధాన రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.