దిత్వా తుఫాన్.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

14చూసినవారు
దిత్వా తుఫాన్.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
AP: దిత్వా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కూటమి ప్రభుత్వం పలు జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు రేపు (డిసెంబర్ 1, 2025) సెలవు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో ఈ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, వరదల దృష్ట్యా ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్