AP: మొంథా తుపాన్ ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 403 మండలాలు తుఫాన్ ప్రభావ పరిధిలోకి వస్తున్నాయి. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 488 కంట్రోల్ రూమ్‌లను, 1204 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు 75,802 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, 219కి పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.