తుఫాన్ ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

50771చూసినవారు
తుఫాన్ ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
AP: 'మొంథా' తుఫాన్ ప్రభావం కారణంగా ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సెలవులు ప్రకటించింది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 29 వరకు సెలవులు ఇచ్చారు. అయితే, తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉన్న కాకినాడ జిల్లాలో అక్టోబర్ 31 వరకు (4 రోజుల పాటు) అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్