నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తూర్పు తీరంలోని పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. మరోవైపు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.