ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఉంది, ఇది నవంబర్ 27 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ నెల 29వ తేదీ నుంచి ఏపీలోని కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.