దిశ మార్చుకున్న మొంథా తుఫాన్

60617చూసినవారు
దిశ మార్చుకున్న మొంథా తుఫాన్
AP: మొంథా తుఫాను దిశను మార్చుకుంది. అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటేందుకు సుమారు 6-8 గంటలు పడుతుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. రేపు ఉదయానికి ఈ తుఫాన్‌ మధ్య ఆంధ్ర తీరంలో బీభత్సం సృష్టించే అవకాశం ఉందని వివరించారు. వచ్చే 2-3 గంటల్లో మచిలీపట్నం, బాపట్ల, ఉత్తర ప్రకాశం (ఒంగోలు), కృష్ణా జిల్లాలో వర్షాలు మరింతగా పెరుగుతాయని పేర్కొంది. విజయవాడ, గుంటూరు నగరాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్