AP: మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలలో భాగంగా దుర్గగుడి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. తుఫాన్ తీరం దాటి, పరిస్థితులు సాధారణం అయ్యే వరకు ఘాట్ రోడ్డును మూసివేయాలని ఈఓ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు కనకదుర్గానగర్ మార్గం లేదా లిఫ్ట్ మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.