ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వైసీపీ ర్యాలీ వాయిదా వేసింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 28న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైసీపీ తలపెట్టిన ర్యాలీ నవంబర్ 4న వాయిదా వేసింది. మొంథా తుఫాన్ నేపథ్యంలో బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలసి వైఎస్ జగన్ సూచించారు. అలాగే వైసీపీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.