AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు 3 జిల్లాలకు సెలవులు ప్రకటించింది. కృష్ణా జిల్లాలో 27, 28, 29 తేదీల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించింది. కాగా, మరికొన్ని జిల్లాల్లోనూ సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.