AP: కాకినాడ తీరం వైపు మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. తీరం వైపు వచ్చే కొద్దీ మరింత ఉధృతంగా మారుతోంది. ఇప్పటికే కోస్తా తీరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతర్వేది, ఓడలరేవు మధ్య గల తూర్పుపాలెం-కేశవదాసుపాలెం మధ్యలో తుఫాన్ తీరం దాటనున్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఇవాళ సా.5.30 నుంచి రా.8.30 గంటల వరకు తుఫాన్ తీరం దాటనున్నట్లు సమాచారం.