ఏపీకి మొంథా తుఫాన్ ముప్పు ముంచుకొస్తుంది. చాలా మంది ప్రజలకు ఎప్పుడు వర్షం పడుతుంది? ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలనేది అవగాహన ఉండదు. అయితే మీ ఫోన్లలోనే వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ది వెదర్ ఛానల్, అక్యూవెదర్, వెదర్ బగ్, వెదర్ అండర్ గ్రౌండ్, ది వెదర్ యాప్‌లు వర్ష సూచనలు చేస్తాయి. ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, రాడార్ ఫోటోలు, హెచ్చరికలు అందిస్తాయి.