‘మొంథా’ తుఫాన్ ముప్పు.. ఏపీకి రెడ్‌ అలెర్ట్‌ (VIDEO)

25554చూసినవారు
AP: ‘మొంథా’ తుఫాన్ ముప్పు కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అక్టోబర్ 26 నుంచి 29వ తేదీ వరకు తుఫాన్ ప్రభావం కొనసాగనుందని తెలిపింది. ఈనెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 90–110 కిమీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. విశాఖపట్నం–తిరుపతి వరకు ఈ ప్రభావం ఉంటుందని, మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్