AP: మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు, విజయవాడ నగరాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంది. తుఫాన్ నెమ్మదిగా కదులుతూ బలహీనపడుతున్నా, మరో రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.