మురసు తుఫాన్.. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (వీడియో)

30చూసినవారు
AP: పల్నాడు, గుంటూరు జిల్లాల్లో మురసు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వాగులు, వంకలు, రహదారులపై వరదలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తిమ్మాపురం వాగు ప్రవాహంలో పలువురు మహిళలు చిక్కుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకూలాయి. వందలాది గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్