వాయుగుండం.. ఈ జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు!

24690చూసినవారు
వాయుగుండం.. ఈ జిల్లాల్లో 2 రోజులు భారీ వర్షాలు!
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ గురువారం వాయుగుండంగా, ఆ తరువాత 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 35-55కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్