AP: సీఎం చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌పై పాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు - పుత్తూరు రోడ్డులో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ముందు పాల రైతులు ఆందోళన చేపట్టారు. వెన్న శాతం తక్కువగా ఉందని జీరో పేమెంట్ లిస్ట్ చేర్చి తమను హెరిటేజ్ మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వద్ద సిబ్బందితో పాల రైతులు వాగ్వాదానికి దిగారు. గత 20 ఏళ్లుగా హెరిటేజ్ సంస్థకు పాలు పోస్తున్నామని, రెండేళ్లుగా జీరో పేమెంట్ కింద చేర్చి మోసం చేస్తున్నారన్నారు. సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.