అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం చెయ్యేరులో 47 ఏళ్ల విరామం తర్వాత గ్రామ దేవత దాసులమ్మ పంటల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పంటలు సమృద్ధిగా పండాలని, సుభిక్షంగా ఉండాలని కోరుతూ వేలాది మంది మహిళలు అఖండ దీపారాధనతో పాటు వివిధ రకాల పిండి వంటలను అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ నైవేద్యాన్ని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని గ్రామస్తుల విశ్వాసం. ఐదేళ్లకోసారి జరిగే ఈ జాతరను కొన్నేళ్లుగా నిలిపివేయడంతో కరువు తాండవిస్తోందని భావించి, గ్రామస్తులు ఈసారి వైభవంగా నిర్వహించారు.