అంతరిక్షంలో డేటా సెంటర్లు.. 10 లక్షల ఉపగ్రహాలు

5302చూసినవారు
అంతరిక్షంలో డేటా సెంటర్లు.. 10 లక్షల ఉపగ్రహాలు
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటుచేయాలని, కక్ష్యలోకి 10 లక్షల ఉపగ్రహాలను పంపాలని యోచిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు అవసరమైన విద్యుత్, కూలింగ్ వ్యవస్థల కోసం ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. సౌరశక్తితో విద్యుత్ సరఫరా అందించేలా ప్రణాళికలున్నాయి. అయితే, ఈ ప్రణాళికలకు సాంకేతికంగా, ఆర్థికంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్