అత్తామామల పోషణ కోడలి బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టు

6119చూసినవారు
అత్తామామల పోషణ కోడలి బాధ్యత కాదు: అలహాబాద్ హైకోర్టు
కుటుంబ వ్యవస్థలో అత్తామామల పోషణ కోడలిపై సామాజిక బాధ్యతగా కనిపించినా, చట్టపరంగా అలాంటి కట్టుబాట్లు ఏవీ లేవని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. కొడుకు మరణించిన తర్వాత కోడలు తమకు భరణం ఇవ్వాలని కోరుతూ ఒక వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) లోని సెక్షన్ 144 ప్రకారం, ఒక వ్యక్తి తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, తల్లిదండ్రులకు మాత్రమే భరణం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అత్తామామలను ఈ చట్ట పరిధిలోకి చేర్చలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్