కర్నూలు జిల్లాలో డెత్‌ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!

8చూసినవారు
కర్నూలు జిల్లాలో డెత్‌ స్పాట్.. ఐదేళ్లలో 50 మంది బలి!
AP: ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో భద్రతా లోపంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ఐదేళ్లలో 50 మందికి పైగా ఈ నదిలో ప్రాణాలు కోల్పోగా, తాజాగా మరో ఏడుగురు గల్లంతయ్యారు. లక్షలాది మంది భక్తులు దర్శనానికి వచ్చే ఈ ప్రాంతంలో, నది లోతు, ప్రవాహంపై అవగాహన లేకపోవడంతో తరచూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత గాలింపు చర్యలు చేపట్టినా, శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఈ ఘటనలు నదీ తీరంలో భద్రతా వ్యవస్థపై కీలక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్