అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మూడో టర్మ్‌పై చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సైన్యాన్ని రెండో టర్మ్‌తో పాటు “మూడో టర్మ్‌లో కూడా” బలోపేతం చేస్తామని వ్యాఖ్యానించిన ట్రంప్, వెంటనే తన మాటను సవరించుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యలు
అమెరికా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కాగా,
అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి రెండు పర్యాయాలకు మించి అధ్యక్షుడిగా కొనసాగేందుకు అవకాశం లేదు.