దేశంలో చాలా మంది మహిళలు ఉన్నత విద్య,
ఉద్యోగాలు, ఆర్థిక స్వావలంబన, ఆలస్య వివాహాల కారణంగా 30 ఏళ్ల తర్వాత గర్భం దాల్చాలని నిర్ణయించుకుంటున్నారు. అయితే, వయస్సు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 20 ఏళ్లలో నెలకి 25-30% గర్భధారణ అవకాశం ఉండగా, 30 ఏళ్ల తర్వాత ఇది తగ్గుతుంది. 40 ఏళ్లలో కేవలం 5% మాత్రమే ఉంటుంది. ఐవీఎఫ్ చికిత్స కూడా వయస్సు ప్రభావాన్ని పూర్తిగా అధిగమించలేదని, 35 ఏళ్ల తర్వాత గర్భస్రావం, మధుమేహం, సిజేరియన్, శిశువులో క్రోమోజోమ్ లోపాల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.