స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు: సీఎం

92చూసినవారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల కోటా ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు: సీఎం
AP: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బీసీ సంక్షేమశాఖపై నిర్వహించిన సమీక్షలో కులగణన చేపట్టాల్సిన అవసరంపై చర్చించారు. ఎన్నికల హామీగా ఇచ్చిన ‘బీసీల రక్షణ చట్టం’పై కూడా అధికారులతో సమాలోచన జరిపారు. వెనుకబడిన వర్గాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని సీఎం స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్