గడ్కరీపై డీప్‌ఫేక్ వీడియోలు: హైకోర్టు ఆగ్రహం

9829చూసినవారు
గడ్కరీపై డీప్‌ఫేక్ వీడియోలు: హైకోర్టు ఆగ్రహం
ఈ20 పెట్రోల్ విషయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో డీప్‌ఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతున్న వారిపై బుధవారం బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వారిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రమంత్రిని, ఆయన కుటుంబాన్ని ఇంధన వివాదంతో ముడిపెడుతున్న ఏఐ వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని మెటా, గూగుల్‌ సహా పలు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా ఉండే పోస్టులను స్వచ్ఛందంగా తొలగించాలని సూచించింది. ఈ20 పెట్రోల్‌తో తన కుటుంబం లబ్ధి పొందుతోందంటూ కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని గడ్కరీ ఇటీవల తెలిపారు.

సంబంధిత పోస్ట్