సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పాత వీడియోలో జింక సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును నమిలి మింగేస్తూ కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా శాకాహార జీవులుగా భావించే జింకలు ఇలాంటి ప్రవర్తన ఎందుకు చూపుతాయనే చర్చ మొదలైంది. వన్యప్రాణి నిపుణుల ప్రకారం.. కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాల లోపం, కొమ్ముల పెరుగుదల లేదా గర్భధారణ సమయంలో అదనపు పోషకాలు అవసరమైనప్పుడు జింకలు అరుదుగా చిన్న జంతువులు, గుడ్లు లేదా పాములను కూడా తింటాయి. ఇది అసాధారణమైనప్పటికీ ప్రకృతిలో కనిపించే సహజ ప్రవర్తనగా నిపుణులు చెబుతున్నారు.