WPL 2026 ఫైనల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. దిల్లీ 49 పరుగుల వద్ద షెఫాలీ వర్మ (20; 13 బంతుల్లో) ఔటైంది. అరుంధతి రెడ్డి వేసిన ఆరో ఓవర్ లో రెండు ఫోర్లు బాదిన షెఫాలీ.. ఐదో బంతికి వికెట్ కీపర్ రిచా ఘోష్కు చిక్కింది. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 53/1గా ఉంది. లారా వోల్వార్ట్ (4), లిజెలి లీ (22) పరుగులతో ఉన్నారు.