ఢిల్లీలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్
జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వస్తున్న వార్తలు మరింత ఆవేదన కలిగిస్తున్నాయని
జగన్ అన్నారు.