వడోదరలో గురువారం జరిగిన WPL ఫైనల్లో రికార్డు స్కోర్ కొట్టినా ఢిల్లీ క్యాపిటల్స్ కల సాకారమవ్వలేదు. తొలి కప్‌ను ఒడిసిపట్టాలని భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేధించింది. దీంతో WPL చరిత్రలో మరోసారి రన్నరప్ ట్యాగ్‌కే పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్. RCB కెప్టెన్ స్మృతి మంధాన(87)జతగా జార్జియా వోల్(74) బౌండరీలతో చెలరేగడంతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి.