సీఎం చంద్రబాబును కలిసిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ (వీడియో)

43చూసినవారు
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసారు. హనుమాన్ కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ నేరుగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, తాజా రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్, డ్రెయిన్లు, రోడ్ల నిర్మాణం, నిర్వహణ అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :