గిరిజనులకు ప్రత్యేక కానుక ప్రకటించిన డిప్యూటీ సీఎం

43చూసినవారు
గిరిజనులకు ప్రత్యేక కానుక ప్రకటించిన డిప్యూటీ సీఎం
మన్యం ప్రాంత గిరిజనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేక కానుక ప్రకటించారు. గిరిజన మహిళలను గర్భస్రావాలు, రక్తహీనత నుంచి రక్షించేందుకు అరకులోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో బ్లడ్ బ్యాంక్ భవనం ఏర్పాటు చేయనున్నారు. గతంలో కురిడీ గ్రామంలో గిరిజనులతో మాట్లాడినప్పుడు, ఒక మహిళ రక్తహీనత, ముఖ్యంగా సికిల్ సెల్ ఎనీమియా రుగ్మత గర్భిణుల ప్రాణాలను తీస్తోందని పవన్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చిన పవన్.. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్