విశాఖ మత్స్యకారుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా

36చూసినవారు
విశాఖ మత్స్యకారుల గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా
AP: విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డు, నేవీ సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులను క్షేమంగా రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్