డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ!

9749చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ!
AP: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ సోమవారం రాత్రి 9 గంటలకు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు, రొటేటర్ కఫ్‌తో పాటు రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో తక్షణం శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. అయితే, ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

సంబంధిత పోస్ట్