AP: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ డిప్యూటీ కలెక్టర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. బ్రహ్మనాయగం అనే అధికారి తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సదరు మహిళ ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆరోపణలు నిజం అని తేలడంతో ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.