నూతన యుగానికి నాంది ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అచ్చెన్న

10చూసినవారు
నూతన యుగానికి నాంది ఉత్తరాంధ్ర అభివృద్ధి: మంత్రి అచ్చెన్న
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇది కేవలం పరిపాలనా నిర్ణయం కాదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయానికి నాంది పలికే మైలురాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు చేసిన నిరంతర ఉద్యమాలకు ఇది విజయ చిహ్నమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్