మండపం పైకప్పు కూలి భక్తురాలు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

4341చూసినవారు
మండపం పైకప్పు కూలి భక్తురాలు మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు
ప్రసిద్ధ సమయపురం మారియమ్మన్ ఆలయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని మండపం పైకప్పు కూలిపోవడంతో తంజావూరుకు చెందిన నదియా (32) అనే భక్తురాలు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి సమయంలో మండపంలో నిద్రిస్తున్న భక్తులపై పైకప్పు కూలింది. తోటి భక్తులు వెంటనే స్పందించి గాయపడిన వారిని రక్షించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్