అమ్మవారి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

40చూసినవారు
AP: నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో, ఆలయ అధికారులు అన్ని వీఐపీ, అంతరాయం దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత కల్పించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి క్యూ లైన్ల ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్లలో భక్తులకు మంచినీటిని అధికారులు అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్